Pawan Kalyan : నేటి నుంచి పవన్ విన్నూత్న కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Update: 2025-05-22 03:09 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు-మాటామంతీ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ కార్కక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

టెక్కలిలోని థియేటర్ లో...
నేడు శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. టెక్కలిలోని థియేటర్ ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను నివేదించవచ్చు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకోనున్న పవన్‌కల్యాణ్‌ వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయనున్నారు.


Tags:    

Similar News