ఏపీలో దుమ్మురేపుతున్న కరోనా.. ఈరోజు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 14,440 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 14,440 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 21,80,634 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,542 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,82,482 గా ఉంది. 83,610 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,2147,031 నమూనాలను పరీక్షించారు.