ఏపీలో తగ్గిన కరోనా కేసులు... మరణాలు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 4,198 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 4,198 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,97,369 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,646 మంది మరణించారు.
కృష్ణా జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,94,359 గా ఉంది. 88,364 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,26,02,251 నమూనాలను పరీక్షించారు.