Ys Jagan : ఎల్లుండి అల్లూరి జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పర్యటించనున్నారు
jagan mohan reddy wished the people of the state for the new year
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పర్యటించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభ లో జగన్ ప్రసంగించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు.
ట్యాబ్‌లు పంపిణీ చేసి...
అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడిన అనంతరం జగన్ ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.