నేడు ఢిల్లీకి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2022-12-05 02:55 GMT

cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. జీ 20 సదస్సు నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఉదయం 12.30 గంటలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.

తిరిగి రాత్రికి...
అనంతరం సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ రాష్ట్రపతి భవన్ లో జీ 20 సదస్సు నిర్వహణపై ప్రధాని నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.55 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. జీ 20 సన్నాహక సమావేశానికి అన్ని పార్టీల అధ్యక్షులను, ముఖ్యమంత్రులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.


Tags:    

Similar News