శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో 'స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు

Update: 2022-09-27 15:06 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో 'స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జగన్ ను ఆలయ అధికారులు, వేద పండితులు వేద ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన జగన్ తలకు అర్చకులు పరికట్టం కట్టారు.

ఊరేగింపు సేవలోనూ...
అనంతరం స్వామి వారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు. సంప్రదాయ పంచెకట్టులో జగన్ స్వామి వారి సన్నిధికి వచ్చారు. ఆయన వెంట టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డి కూడా ఉన్నారు. 9 గంటలకు ఆలయ మాడ వీధుల్లో జరిగే స్వామి వారి పెద్ద శేషవాహనంపై జరిగే ఊరేగింపు కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు.


Tags:    

Similar News