వర్షంలోనే జగన్ పర్యటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్లారు.

Update: 2022-07-26 06:59 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్లారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడంతో ట్రాక్టర్ లో జగన్ బయలు దేరి వెళ్లారు. తొలుత పి. గన్నవరం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్న జగన్ అక్కడ వరద బాధితులను పరామర్శించారు. భారీ వర్షం కురుస్తున్నా జగన్ తన పర్యటనను కోనసీమలోని లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

వరద బాధితులను....
జి.పెదపూడి గ్రామం తర్వాత ఆయన పుచ్చకాయలపాట చేరుకున్నారు. అక్కడ వరద బాధితులతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారికి అందిన సహాయం పై అడిగి తెలుసుకున్నారు. ఎంత నష్టం జరిగింది బాధితులతో నేరుగా మాట్లాడి జగన్ తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి అరిగెలవారి పేట లో ఉన్న వరద బాధితులను కూడా జగన్ కలుస్తారు. అనంతరం ఆయన ఊడిమూడిలంక చేరుకుంటారు. తర్వాత రాజోలు మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాజమండ్రికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.


Tags:    

Similar News