రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను పరామర్శించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను పరామర్శించారు. జగన్ తో్ పాటు ఆయన భార్య భారతి కూడా రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పోస్ట్ కోవిడ్ సమస్య లతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన సంగతి తెలిసిందే. రెండుసార్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హైదరాబాద్ లో చికిత్స పొందారు.
విశ్రాంతి తీసుకోవాలని....
ఆయన కోలుకుని తిరిగి రాజ్ భవన్ కు నాలుగు రోజుల క్రితం చేరుకున్నారు. దీంతో జగన్ దంపతులు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు రాజ్ భవన్ కు వచ్చారు. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని జగన్ గవర్నర్ కు సూచించారు.