Chandrababu : చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు నేడు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు నేడు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఉదయం పదకొండు గంటలకు జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ మొల్లెర్ మెర్స్క్ లాజిస్టిక్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటారు.
అవగాహన ఒప్పందం...
దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 6.30 గంటలకు మొబైల్ హెల్త్ క్లినిక్, డయాగ్నోస్టిక్ బస్సులను ప్రారంభించనున్నారు. దీంతో పాటు సచివాలయంలో ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమవుతారు. సచివాలయం నుంచి బయలుదేరి సాయత్రం 06.50 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.