Chandrababau : చంద్రబాబు నేటి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్షలు చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ పై సమీక్ష చేస్తారు.
వివిధ శాఖలపై సమీక్షలు...
అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొంటారు. దీంతో పాటు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న అధికారులు,మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం 06.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.