Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-08-26 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. అధికారులు, ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న రాజకీయ నేతలతో ఆయన మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు సచివాలయానికి వెళ్తారు.

బ్యాంకర్ల సమావేశం...
ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొంటారు. రైతులకు రుణాలు ఇచ్చే అంశంపై బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. బ్యాంకు రుణాలు విరివిగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తననివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News