Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-06-09 03:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరి వస్తారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ రహదారులు & పీపీపీ విధానంలో రహదారుల నిర్మాణంపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు.

శాఖలపై సమీక్షలు...
మధ్యాహ్నం రెండున్నర గంటలకు వర్చువల్ గా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర కార్యాలయాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. 03.30 గంటలకు మైనింగ్ శాఖపై సమీక్ష చేయనున్న చంద్రబాబు ఆదాయం పెంచుకోవడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు స్టేట్ క్వాంటమ్ మిషన్ పై చంద్రబాబు సమీక్ష సమీక్షిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News