Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి రానున్నారు. వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారని, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు.
వివిధ శాఖలపై సమీక్షలు...
మధ్యాహ్నం మూడు గంటలకు మిర్చి ట్రేడర్లు, అధికారులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రైతుకు మిర్చి గిట్టు బాటు ధరలు, ఎగుమతుల అంశంపై వారితో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఆర్డీఏ అధికారులతో సమావేశమవుతారు. రాజధాని నిర్మాణపనులపై ఆయన సమీక్ష జరుపుతారు. తిరిగి 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.