Chandrababu : నేడు కోనసీమ జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మడి వరం నియోజకవర్గం చెయ్యేరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
పింఛన్ల పంపిణీలో...
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండో నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. అక్కడ లబ్దిదారుల ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. పేదల సమస్యలను వినడంతో పాటు వాటి పరిష్కారానికి కూడా వెంటనే చంద్రబాబు ఆదేశాలు ఇవ్వనున్నారు.