Chandrababu : నేడు రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి రాజధాని పనులపై సమీక్ష నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి రాజధాని పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. సీఆర్డీఏలో చర్చించిన తర్వాత రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు.
సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో...
ఇప్పటికే రాజధాని పనుల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో కొంత మొత్తాన్ని సీఆర్డీఏ ఖాతాకు బదిలీ చేసింది. దీంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో మరో నలభై వేల ఎకరాల భూ సేకరణపై కూడా అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ మొదలయింది. దీంతో పాటు మరికొన్నికీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.