నేడు చంద్రబాబు కీలక సమీక్ష.. పెద్ది రెడ్డి భూములపై

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

Update: 2025-01-29 04:48 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. వచ్చిన వెంటనే రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ మాఫియా ఆగడాలు,తదుపరి చర్యలపై చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.

ప్రభుత్వానికి నివేదిక అందడంతో...
ప్రభుత్వానికి ప్రాధమిక నివేదికను ఇప్పటికే అధికారులు సమర్పించారు. రికార్డులుు తారుమారు చేసి బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో నేడు జరిగే చంద్రబాబు సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. భూ ఆక్రమణలపై చర్యలకు ఏరకంగా సిద్ధమవ్వాలన్న దానిపై చంద్రబాబు నేడు సమీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News