చంద్రబాబు పాడేరు పర్యటన రద్దు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది

Update: 2025-06-29 02:51 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. , జులై 1వ తేదీన చంద్రబాబు పాడేరులో పర్యటించాల్సి ఉంది. ఆరోజు అక్కడ లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాడేరు పర్యటన కు సంబంధించి పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. మవోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో పర్యటన రద్దు చేసుకోవాలని సూచించారు.

పెన్షన్లు పంపిణీ కార్యక్రమం...
పెన్షన్లు పంపిణీ కార్యక్రమం వేరే జిల్లాకు మార్పు చేసే అవకాశముంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ఆరోజు పర్యటించే అవకాశముందని తెలిసింది. ప్రతి నెల ఒకటో తేదీన చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ లబ్దిదారులతో మాట్లాడుతూ వస్తున్నారు. తర్వాత ప్రజాదీవెన సభలో పాల్గొంటారు.


Tags:    

Similar News