Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు.

Update: 2025-10-06 03:08 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు సంక్షేమ శాఖలపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 02.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేయనున్నారు.

వరస సమీక్షలతో...
సాయంత్రం 4.40 గంటలకు విజయవాడ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లనున్నారు. అక్కడ స్వచ్ఛతా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి 7.10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.


Tags:    

Similar News