Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-10-09 03:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై ఆయన సమీక్ష చేయనున్నారు. అలాగే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితో సమావేశమవుతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించి అధికారులతో చంద్రబాబు సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

వ్యవసాయ రంగంపై...
ఈరోజు ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు రబీ సీజన్ సన్నద్ధత, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష చేస్తారు. రైతులకు రబీ సీజన్ లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News