చంద్రబాబు కొవ్వూరు పర్యటన ఆలస్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. వాతావరణం సరిగా లేకపోవడంతో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండింగ్ చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రాజమండ్రి కి బయలుదేరి వెళతారు.
వాతావరణం అనుకూలించక...
రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో మలకపల్లికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదికలోనూ ప్రసంగించనున్నారు. తర్వాత టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన అనంతరం రాజమండ్రి బయలుదేరి వెళ్లి అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గం బయలుదేరి వెళ్లనున్నారు.