Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానున్నారు. కార్యకర్తల నుంచి ఆయన స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. నేడు గ్రీవెన్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు.
కార్యకర్తల నుంచి
కొందరు ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలసి తమ సమస్యలను చెప్పుకునే వీలు కలుగుతుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారు. జులై 2 వ తేదీ నుంచి ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమం పై దిశానిర్దేశం చేయనున్నారు.