Chandrababu : 26న సింగపూర్ కు చంద్రబాబు
ఈనెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు
ఈనెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని కోరనున్నారు. అమరావతి నిర్మాణానికి తిరిగి రావాలంటూ సింగపూర్ ప్రభుత్వాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడకు బయలుదేరి వెళుతున్నారని చెబుతున్నారు.
ఐదు రోజుల పర్యటన...
అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలంటూ సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. జులై 26 నుంచి సింగపూర్ లో ఐదు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు పి. నారాయణ, టి.జి. భరత్, ఎన్. లోకేష్ సహా పలువురు ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం కూడా వెళుతుంది. దీంతో పాటు పోర్టులు, టెక్నాలజీ, మౌలిక వసతుల రంగాలలో పెట్టుబడుల అన్వేషణకు కూడా ఈ బృందం ప్రయత్నిస్తుంది.