Chandrababu : నేడు కాకినాడ జిల్లాకు చంద్రబాబు

నేడు కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు

Update: 2025-08-23 02:54 GMT

నేడు కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాాలోని పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పెద్దాపురం చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదో వార్డు చేరుకొని మ్యాజిక్ డ్రైన్‍ను ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో...
రజిత రథంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీమా మంజూరు చేయనున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక వద్దకు చేరుకొని ప్రసంగించనున్నారు. సాయంత్రం పార్టీకి చెందిన పలువురుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.


Tags:    

Similar News