Chandrababu : నేడు గుజరాత్‌కు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నారు. గ్లోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఆయన పాల్గొంటారు
chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నారు. గాంధీనగర్ లో గ్బోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఆయన పాల్గొంటారు. ఈ వేదిక ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు. దీంతో పాటు నివేదికను కూడా అందచేయనున్నారు. మూడు రోజుల పాటు గాంధీనగర్ లో జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు.
తొలి రోజు...
సదస్సు తొలి రోజు చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం మరింతగా సోలార్, విండ్, హైడ్రో విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాటుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించనున్నారు. పెట్టుబడుల కోసమే చంద్రబాబు గుజరాత్ పర్యటన నేడు చేపట్టారు. విద్యుత్తు ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను కూడా వివరించనున్నారు. తమ ప్రాధాన్యత ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును సరసమైన ధరలకు అదించడమే లక్ష్యమని తెలపనున్నారు.