నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండటంతో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. దావోస్ నుంచి రాత్రి 12.45 గంటలకు వచ్చిన చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు.
బడ్జెట్ లో నిధులు కేటాయించేలా...
కేంద్ర బడ్జెట్ లో అవసరమైన నిధులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు నాయుడు నేడు సమావేశమై ఏపీకి బడ్జెట్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై కూడా కేంద్ర మంత్రులపై చంద్రబాబు చర్చించనున్నారు.