Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
రాజధాని పనులను...
ప్రధాని సమయాన్ని బట్టి రాజధాని అమరావతి పనుల ముహూర్తాన్ని నిర్ణయించనున్నారు. ప్రధాని మోదీ కార్యాలయానికి ఇప్పటికే సమాచారాన్ని అందించిన చంద్రబాబు నాయుడు ఆయన అమరావతికి ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నారు. దీంతో పాటు కొన్ని కీలక అంశాలపై ప్రధాని మోదీతోనూ, కేంద్ర మంత్రులతోనూ రేపు చర్చించే అవకాశముంది.