Chandrababu : చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. రెండు రోజులు అక్కడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు నాయుడు కలవనున్నారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకపై మంత్రులతో చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన విషయాలపై కూడా చర్చించనున్నారు. పదిహేనో తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
కేంద్ర మంత్రులతో...
ఆరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు. 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సమావేశమవుతారు. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయి బనకచర్లపై చర్చిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వినతి పత్రాన్ని అందిస్తారరు. 17న ఉదయం తిరిగి ఉదయం బయలుదేరి ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకుంటారు.