Chandrababu: నేడు కొవ్వూరు నియోజకవర్గం పర్యటనకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-07-01 02:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో చంద్రబాబు పర్యటిస్తార. ఉదయం పదిగంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పదిన్నర గంటలకు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను...
అక్కి నుంచి కారులో 10.45 గంటలకు మలకపల్లికి చేరుకుంటారు. లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. పీ -4 పథకం కింద నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుంటారు. అనంతరం కాపవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి వెళతారు.


Tags:    

Similar News