సాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఏమన్నారంటే?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నవ్వుతూ విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించాలని కోరగా, పార్టీ పై నమ్మకం ఉంటారని, లేకుంటే వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు.
అంతర్గత విషయమని...
అయితే అది వైసీపీ అంతర్గత విషయమని, తమకు సంబంధం లేని అంశమని ఆయన చెప్పారు. పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఏ పార్టీలోనైనా ఎవరైనా ఎందుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. దావోస్ పర్యటనపై ఆయన మీడియాకు వివరాలు తెలుపుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించారు.