నేడు బ్యాంకర్లతో చంద్రబాబు భేటీ.. రైతులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనున్నారు

Update: 2025-02-04 01:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పలు సూచనలు చేయనున్నారు. త్వరలో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

వందనం కూడా...
రైతులకు రుణాలను ఇచ్చే విషయంపై కూడా బ్యాంకర్లకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. అలాగే త్వరలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనుండటంతో దీనికి సంబంధించిన వివరాలను కూడా బ్యాంకర్లతో చర్చించనున్నారు. దీంతో ఈ రెండు పథకాలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుండటంతో నేడు జరిగే బ్యాంకర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News