Chandrababu : నేడు కర్నూలుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్నారు

Update: 2025-05-17 02:03 GMT

chandrababu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈరోజు ఉదయం 11.25 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సీ క్యాంప్ రైతు బజార్ ను పరిశీలించనున్నారు. అక్కడ స్ధానికులతో మాట్టాడతారు.కేంద్రీయ విద్యాలయ - స్వచ్ఛాంధ్ర పార్క్ కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

వివిధ కార్యక్రమాల్లో...
అనంతరం అక్కడ జరిగే ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పాటు కర్నూలుకు చెందిన టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేలా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News