Chandrababu : ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో మరికొంత నగదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు

Update: 2025-06-16 07:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తొలి ఏడాదిలోనేసూపర్ సిక్స్ హామీలను అమలుపర్చామన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఫీల్ గుడ్ మూమెంట్ ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేయడంతో పాటు తాజాగా తల్లికి వందనం పథకం కింద నిధులను కూడా జమ చేయడంతో పాటు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రైతులకు అందించనున్నారు. మహిళల ఓట్లు తమ విజయానికి కీలకం అని భావించి వారికి ఇచ్చిన హామీలను ముందుగా చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారు.

ఇప్పటి వరకూ హామీలు...
అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయీలతో కలిపి ఏడు వేల రూపాయలు వృద్ధులు, వితంతువులకు పింఛను ఇచ్చేశారు. పింఛను గత ఏడాది నుంచి ఠంచన్ గా ఒకటో నెల పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయలు ఇస్తున్నారు. ఇక మహిళలకు భారంగా మారిన గ్యాస్ సిలిండర్ ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా మహిళల ఖాతాల్లో తల్లికి వందనం నిధులను జమ చేస్తున్నారు. ఇక ఆగస్టు పదిహేనో తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
ఆడబిడ్డ నిధి పథకాన్ని...
తాజాగా మరొక పథకాన్ని కూడా గ్రౌండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. అంటే వారికి ఏడాదికి పద్దెనిమిదివేలు అందుతాయి. మహిళల కోసం ఈ పథకాన్ని వెంటనే అమలుచేయాలని, రెండో ఏడాది ప్రారంభంలోనే పథకాన్ని అందచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దరఖాస్తులను కూడా త్వరలో స్వీకరిస్తారని, ఈ పథకం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. బడ్జెట్ లో ఈ పథకం కోసం ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు కేటాయించడంతో మహిళల ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయాలన్న ఆలోచనతో ఉంది. మరి మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Tags:    

Similar News