Chandrababu : చంద్రబాబు నేటి విశాఖ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి విశాఖపట్నం రద్దు చేసుకున్నారు
chandrababu,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి విశాఖపట్నం రద్దు చేసుకున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన విమానం ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికా ఈరోజు విశాఖలో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. అక్కడ జరిగే న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్ లో పాల్గొనాల్సి ఉంది.
ఏడాది వేడుకలు కూడా...
కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషాదం మిగిల్చడంతో తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదం ఘటనతో సుపరిపాలనలో తొలి అడుగు అని మొదటి ఏడాది వేడుకలను కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది. నిన్న సాయంత్రం ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో దానిని రద్దు చేశారు.