Chandrababu : నేడు చంద్రబాబు పుట్టిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

Update: 2025-04-20 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. అందుకే నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు కానుకగా నిరుద్యోగులకు తీపికబురును విద్యాశాఖ అందించనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా...
మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాలలో కేక్ కట్ చేసి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించనున్నారు. చంద్రబాబు సుదీర్ఘకాలం జీవించి ఆయన రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. రక్తదానం చేయనున్నారు. పేదలకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేయనున్నారు.


Tags:    

Similar News