Chandrababu : నేడు ఏలూరు జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-12-01 02:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద లబ్దిదారులకు పింఛను పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు.

గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో...
లబ్దిదారులతో మాట్లాడి వారి ఇంట్లో కాసేపు గడపనున్న ముఖ్యమంత్రి తర్వాత గోపాలపురంలో జరిగే ప్రజాదీవెన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం గొల్లగూడెంలో పార్టీ ముఖ్య నేతలతోనూ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసాను చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు.


Tags:    

Similar News