Chandrababu : అమరావతికి చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ మీదుగా ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్, ఉన్నతాధికారకులు తదితరులు స్వాగతం పలికారు.
నాలుగు రోజుల పాటు పర్యటించి...
చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించి నవంబర్ లో విశాఖపట్నంలో జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరి వచ్చారు. అక్కడ వివిధ ప్రాంతాలను పర్యటించడమే కాకుండా, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ సమావేశమై చర్చించి వచ్చారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, నారాయణతో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు.