Ap Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలివే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.

Update: 2025-01-17 01:52 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకో నుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమా లకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ముఖ్య మంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చించనున్నారు.

అనుకూలమైన నిర్ణయాలు...
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యం తరాలు వ్యక్తం చేసిన నేపథ్ంయలో ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందనిచెబుతున్నారు. నేటి కేబినెట్‌ సమావేశంలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. దీంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త ఏడాది జరిగే రెండో కేబినెట్ సమావేశం కావడంతో కొన్ని వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News