Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది.

Update: 2025-09-19 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం మంత్రి వర్గ సమావేశం తెలపనుంది. శాసనసభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు. దీంతో పాటు పదిహేను అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనుంది. నిన్న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం నేడు వాయిదా పడింది.

పంచాయతీ రాజ్ చట్టంపై...
ఈరోజు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలునిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్‌పై ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. ఈరోజు శాసనసభలో ఎనిమిది బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందిద. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభలో.ప్రవేశపెట్టనున్నారు.


Tags:    

Similar News