Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

Update: 2025-09-18 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.

వైఎస్సార్ పేరు తొలగించి...
రాజధాని అమరావతికి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ కు కూడా మంత్రి వర్గ సమావేశం తెలపనుంది. దీంతో పాటు వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదనకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పలు కీలకమైన అంశాలను చర్చించే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News