Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో 20,494 ఎకరాల భూసమీకరణకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల నుంచి ఈ భూ సమీకరణ చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకంపై...
ఈ ఇరవై వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు విద్యాసంస్థలు, క్రికెట్, బ్యాడ్మింటన్ అకాడమిలు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాకి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు మరి కొన్ని కీలక అంశాలను కూడా పరిశీలించి చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.