Adhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీంతో పాటు విశాఖలోని పంచగ్రామాల సమస్యలకు పరిష్కారం కల్గించే అంశంపై ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనుంది.
ఎస్ఐపీబీ బోర్డు ఆమోదించిన...
స్టేట్ ఇన్విస్టిమెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన 44,776 కోట్ల రూపాయల పదిహేను ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదించనుంది. ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. దీంతో పాటుగా రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్స్, ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చంద్రబాబు ఇన్ ఛార్జి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చించనుంది.