Cabinet meeting : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు దిశగా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు కీలక నిర్ణయాల దిశగా కూడా చర్చించి మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కాకినాడ పోర్టుతో పాటు....
రాజధాని అమరావతిలో పనులు ప్రారంభం, విశాఖ, విజయవాడలలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రధానమైనది కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశంపై కీలక నిర్ణయం మంత్రి వర్గం తీసుకునే అవకాశముంది. కాకినాడ పోర్టు నుంచి పెద్దయెత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండటంతో దానిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కొన్ని కఠిన నిర్ణయాలను మంత్రివర్గం ప్రకటించే అవకాశముంది.