Andhra Pradesh : ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 7వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 7వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటి కానుంది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపాలంటూ...
అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి 5లోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఈ మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు చర్చించే అవకాశముందని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి, భూమి కేటాయింపులకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది.