Ap Cabinet : 15న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది
Cabinet meeting AP
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలుత 14వ తేదీన మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని భావించినా కొన్ని కారణాల వల్ల పదిహేనో తేదీకి కేబినెట్ భేటీని మార్పు చేశారు. ఈ కేబినెట్ భేటీలో అనేక ముఖ్య నిర్ణయాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది.
కీలక బిల్లులకు...
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులకు కేబినెట్ లో ఉంచాల్సిన ప్రతిపాదనలను పంపాల్సిందిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కోరారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం నాలుగు గంటల్లోపు ప్రతిపాదనలు అందేలా చూడాలని చీఫ్ సెక్రటరీ అన్ని శాఖల అధికారులను కోరారు.