Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

Update: 2025-07-24 02:02 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు కూడా కేబినెట్ సమావేశం చర్చించిన అనంతరం ఆమోదించే అవకాశముంది.

భూముల కేటాయింపుపై...
రాజథాని అదనంగా భూసేకరణ అంశంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇక అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కూడా చర్చించనుంది. దీంతో పాటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలతో పాటు పలు సంస్థలకు భూములు కేటాయింపులపై కూడా సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.


Tags:    

Similar News