Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. దీపావళికి ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ భేటీ సచివాలయంలో జరగనుంది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే మంగళగిరి - తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇరవై ఐదు శాతం నిధులను సీఆర్డీఏ కు ఇచ్చేందుకు మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనుంది.
ఉద్యోగులకు డీఏ...
అలాగే అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి 212 కోట్ల రూపాయలను కేటాయించే అంశాన్ని కూడా ఆమోదించనుంది. ఉద్యోగులకు డీఏ కేటాయింపుపై కూడా చర్చించి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. దీపావళికి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. దీంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. ఆమోదించనుంది. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడు చర్చించి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.