Andhra Pradesh : ముగిసిన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.

Update: 2025-12-11 08:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మహిళ క్రికెటర్ శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదుతో పాటు విశాఖలో ఐదు వందల గజాల స్థలాన్ని ఇవ్వాలనిమంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. మొత్తం నలభై అంశాలపై కేబినెట్ సమావేశం చర్చించింది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణాన్నితీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాబార్డు నుంచి 7,258 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

భూ కేటాయింపులకు...
అదే సమయంలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేయడానికి కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్ఐడీపీ ఇచ్చిన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. తద్వారా యాభై వేల ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు కేబినెట్ అభిప్రాయపడింది. రెండున్నర గంటల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని మంత్రులను ఆదేశించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత వేగం పెంచాలని, నాలుగైదు రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన ఆరుగురుమంత్రులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News