Andhra Pradesh : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు...వారికి రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడు లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాను తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆ భూములపై తగిన నిర్ణయం తీసుకోవడానికి ఈ కేబినెట్ సబ్ కమిటీని నియమించనున్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలోపు ప్రభుత్వానికి దీనిపై అధ్యయనంచేసి నివేదిక ఇవ్వాలని సమావేశం తీర్మానించింది.
అన్నా క్యాంటిన్ల ఏర్పాటుకు...
దీంతోపాటు ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రపాయల రుణం తీసుకోవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మార్క్ ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.