Andhra Pradesh :నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు
ఈరోజు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ఈరోజు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం జీవో అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకుంటారు. తర్వాత లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారు. మరొకవైపు నేడు రెండు కీలక బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
స్వల్పకాలిక చర్చ...
ఆక్వాకల్చర్ డెవలెప్ మెంట్ అధారిటీ సవరణ బిల్లు, గ్రామ వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో నేడు ప్రశేపెట్టనుంది. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టనున్నారు. ఆక్వా, సహకార శాఖలకు సంబంధించిన బిల్లుులను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అమరావతి అభివృద్ధి పనులు, ఉద్యోగుల పీఆర్సీ, చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం, నూతన బాలికా సంరక్షణ చట్టంపై ప్రకటన వెలువడే అవకాశముంది.