Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజులపాటు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజులపాటు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల పనిదినాలు, సెలవులపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సభలో చర్చించాల్సిన అంశాలపై తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది ప్రతిపాదనలు చేసింది.
ఈరోజు ఉదయం ప్రశ్నోత్తరాలతో...
ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అయితే ఈరోజు కొన్ని కీలక బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. సభలో చర్చించాల్సిన అజెండా కూడా నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.